'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంపై ఏపీ హైకోర్టులో పిల్
- ఈ సంక్రాంతి సీజన్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
- ఈ చిత్రం బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ పిల్
- ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలంటూ ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి
విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే దిల్ రాజు నివాసంలో గత నాలుగు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించారు. దిల్ రాజు కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో పిల్ దాఖలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.