Birth Right Citizenship: జన్మతః పౌరసత్వ రద్దుపై డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు షాక్!

US judge temporarily blocks Trumps order on birthright citizenship
షార్ట్స్‌లో చూడండి
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాకిచ్చింది. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీచేశారు. వాటిలో జన్మతః పౌరసత్వ రద్దు కూడా ఒకటి. 

ట్రంప్ ఆదేశాలపై అమెరికా వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆ ఆదేశాలను తాత్కాలికంగా పక్కనపెడుతూ ఆదేశాలు జారీచేసింది.
Go Back to Shorts
Birth Right Citizenship
USA
Donald Trump

More Telugu News