రేపు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలవనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన
- ఈ అర్ధరాత్రి ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు
- రేపు సాయంత్రం విజయవాడ రాక
రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. అనంతరం, రేపు సాయంత్రం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు.