దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో సమావేశానికి కాలినడకన నారా లోకేశ్... వీడియో ఇదిగో!

  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
  • ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల వేట
  • కీలక సమావేశాలతో చంద్రబాబు, నారా లోకేశ్ బిజీ
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ఏపీ ప్రభుత్వ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పెట్టుబడుల సాధనకు శక్తిమేర కృషి చేస్తున్నారు. 

కాగా, దావోస్ లోని కాంగ్రెస్ సెంటర్ లో ఓ సమావేశానికి నారా లోకేశ్ కాలినడకన వెళ్లడం ఓ వీడియాలో కనిపించింది. తాము బస చేస్తున్న హోటల్ నుంచి వాహనంలో బయల్దేరిన లోకేశ్... మార్గమధ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ట్రాఫిక్ జామ్ లో వాహనం నిలిచిపోవడంతో, తన బృందంతో కలిసి ఆయన రోడ్డు మార్గంలో కాలినడకన కాంగ్రెస్ సెంటర్ చేరుకున్నారు. కీలక సమావేశానికి సకాలంలో చేరుకోవాలన్న ఆయన తపన పట్ల నెటిజన్లు అభినందిస్తున్నారు.Your browser does not support HTML5 video.


More Telugu News