చెన్నైలో భార‌త్‌, ఆసీస్ రెండో టీ20.. మ్యాచ్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు టీఎన్‌సీఏ బంప‌ర్ ఆఫ‌ర్‌!

  • ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఈరోజు నుంచి ప్రారంభం
  • ఇవాళ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ 
  • రెండో మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నున్న చెన్నై 
  • ఈ మ్యాచ్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఉచిత మెట్రో ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించిన టీఎన్‌సీఏ
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక రెండో మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ నెల 25న (శ‌నివారం) చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. 

ఈ క్ర‌మంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఈ మ్యాచ్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మ్యాచ్ చూసేందుకు వ‌చ్చేవారికి ఉచిత మెట్రో స‌ర్వీసుల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. మ్యాచ్ వీక్షించేందుకు టికెట్ కొనుగోలు చేసిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని టీఎన్‌సీఏ కోరింది. 

"మ్యాచ్ టికెట్ హోల్డర్లు స్టేడియానికి రావ‌డంతో పాటు మ్యాచ్ అనంత‌రం వెళ్లేందుకు కూడా ఈ ఉచిత మెట్రో స‌ర్వీసులను పొందవచ్చు" అని టీఎన్‌సీఏ త‌న సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. మ్యాచ్ షెడ్యూల్ ప్ర‌కారం ప్రేక్ష‌కులు వారి ప్ర‌యాణాన్ని ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది. 

ఇక రెండవ టీ20 కోసం టిక్కెట్లు భారీగానే అమ్ముడయ్యాయ‌ని తెలిపింది. వారాంతం కావ‌డంతో ఈ మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం నిండిపోవ‌డం ఖాయ‌మ‌ని టీఎన్‌సీఏ భావిస్తోంది. కాగా, 2023 ఐపీఎల్ సీజ‌న్‌లో కూడా చెన్నైలో జ‌రిగిన మ్యాచ్‌ల‌కు చెన్నై మెట్రో రైల్, టీఎన్‌సీఏ భాగస్వామ్యంతో టికెట్ హోల్డర్‌లకు ఉచిత మెట్రో ప్రయాణాన్ని అందించింది. మెరీనా బీచ్ సమీపంలో ఉన్న చెపాక్‌ వేదిక చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఇలాంటి ప్ర‌యోగాలు చేస్తున్న‌ట్లు టీఎన్‌సీఏ ప్ర‌తినిధులు తెలిపారు.


More Telugu News