ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత మృతి.. అతడి తలపై రూ.కోటి రివార్డు
- కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎదురుకాల్పులు
- 14 కు పెరిగిన ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య
- భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం
ఛత్తీస్ గఢ్ లోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కీలక నేత మరణించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం అలియాస్ చలపతి ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయాడని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. చలపతిపై ప్రభుత్వం గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించిందని తెలిపారు. ఒడిశా బార్డర్ లోని గరియాబండ్ జిల్లా కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతాబలగాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడం, కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయారు. చెట్లు, పొదల పక్కన పడి ఉన్న మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.