నేడు అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం .. భారత్ ప్రతినిధిగా జయశంకర్
- నేడు వాషింగ్టన్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
- కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకార వేదిక
- భారత్ ప్రతినిధిగా హజరువుతున్న జైశంకర్
అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హజరువుతున్నారు. ఇప్పటికే ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. మరో పక్క భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ దంపతులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు.
కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తొలి రోజే వందకుపైగా కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తారు. అమెరికాలో సౌత్ సరిహద్దులు బంద్ చేయడంతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపడం లాంటి చాలా అంశాలపై సంతకం చేయనున్నారు.
యూఎస్ సైన్యంలో ట్రాన్స్ జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారిగా 15 వేల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం నెలకొందని భావిస్తున్నారు. పలు దేశాలపై అదనపు పన్నుల విధింపుపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.