వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడిపై కేసు నమోదు

  • చంద్రబాబుపై తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు
  • 2022 నవంబర్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన తోపుదుర్తి
  • జిల్లా ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 నవంబర్ లో చంద్రబాబు, ఆయన కుటుంబంపై చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీపీ గదిలో వైసీపీ కార్యకర్తలతో కలిసి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం జిల్లా ఎస్పీ జగదీశ్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News