ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక యాజమాన్యాలతో పనిలేకుండానే అకౌంట్ ట్రాన్స్ఫర్
- ఖాతాల బదిలీ, వ్యక్తిగత వివరాల్లో మార్పులపై ఖాతాదారుల ఇబ్బందులు
- ఇకపై ఎవరికి వారే ఆన్లైన్లో ఖాతా బదిలీ, వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం
- ఇప్పటికే పలు మార్పులు తీసుకొచ్చిన ఈపీఎఫ్వో
- కంపెనీల చుట్టూ తిరిగే బాధను తప్పించిన ఈపీఎఫ్వో
ఇకపై ఖాతాల బదిలీని మరింత సరళతరం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటును నిన్నటి (శనివారం) నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా యాజమాన్యాల చుట్టూ తిరగడం, సమయం వృథా కావడం తప్పుతుంది. అయితే, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్వో తెలిపింది.
వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్లైన్లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. షరా మామూలుగానే వారి యాజమాన్యాలే ఈ పని చేయాల్సి ఉంటుంది.