తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి ఏ ఫుడ్ తింటారో చెప్పిన బాలయ్య
- ప్రొడక్షన్ ఫుడ్ తిని ఇంత ఫిట్‌గా ఉన్నానన్న బాలకృష్ణ
- షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని వెల్లడి
- ఈ విషయంలో భార్య వసుంధర తనను తిట్టినా సరే.. తాను మాత్రం తగ్గనన్న బాలయ్య
తన ఇంటి సమీపంలో షూటింగ్ జరుగుతున్నా సరే.. తాను మాత్రం ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని తెలిపారు. ఈ విషయంలో భార్య వసుంధర తనను తిడుతుందని, అయినా తాను మాత్రం తగ్గనని చెప్పుకొచ్చారు. ఇవాళ తాను ఇంత హుషారుగా, ఫిట్‌గా ఉన్నానంటే ఇండస్ట్రీ ఫుడ్ తినడమేనని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలయ్య అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.