YS Jagan: పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించిన జగన్

YS Jagan appoints coordinators for constituencies
    
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. 

చోడవరం నియోజకవర్గానికి గుడివాడ అమర్‌నాథ్‌ను సమన్వయకర్తగా నియమించారు. మాడుగలకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), గాజువాకకు తిప్పల దేవన్‌రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గానికి గన్నవరపు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీచేశారు. అలాగే, వరికూటి అశోక్‌బాబును పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.  
YS Jagan
YSRCP
Coordinator
Andhra Pradesh

More Telugu News