Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయం సమీపంలో ఎగ్ బిర్యానీ పట్టుబడింది: భూమన

TTD Ex Chairman Bhumana Karunakara Reddy Sensational Allegations Against AP Govt
  • తిరుమ‌ల‌లో విజిలెన్స్ నిఘా పూర్తిగా కొర‌వ‌డింద‌న్న‌ టీటీడీ మాజీ ఛైర్మ‌న్ 
  • కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో మ‌ద్యం, మాంసం తిరుమ‌ల‌లో ప‌ట్టుబ‌డుతున్నాయని విమ‌ర్శ‌
  • సామాన్య భ‌క్తుల‌ను ప‌ట్టించుకోవడం లేదని వ్యాఖ్య
తిరుమ‌ల‌లో విజిలెన్స్ నిఘా పూర్తిగా కొర‌వ‌డింద‌ని టీటీడీ మాజీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మండిప‌డ్డారు. శ్రీవారి ఆలయం సమీపంలో తాజాగా ఎగ్ బిర్యానీ పట్టుబడ‌టం దీనికి నిద‌ర్శ‌నం అన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వంపై భూమన తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

"మీపాల‌న‌లో మ‌ద్యం, మాంసం తిరుమ‌ల‌లో ప‌ట్టుబ‌డుతున్నాయి. తాజాగా శ్రీవారి ఆల‌యానికి స‌మీపంలో ఎగ్ బిర్యానీ పట్టుబడింది. మార‌ణాయుధాల‌తో వ‌చ్చినా ప‌ట్టించుకోని ప‌రిస్థితికి తీసుకువ‌చ్చారు. టీడీపీ నేత‌ల సేవ‌లో టీటీడీ ఛైర్మ‌న్ ప‌నిచేస్తున్నారు. సామాన్య భ‌క్తుల‌ను ప‌ట్టించుకోవడం లేదు. మ‌రోసారి ప్ర‌భుత్వం వైఫ‌ల్యం బ‌య‌ట‌డింది" అని మాజీ ఛైర్మ‌న్ భూమ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

ఇక కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో తిరుమ‌ల కొండ‌పై ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేస్తూ నాలుగుసార్లు ప‌ట్టుబ‌డ్డార‌ని భూమ‌న తెలిపారు. ల‌డ్డూ ప్ర‌సాదం విష‌యంలో త‌మ‌పై నింద‌లు మోపార‌ని ఆయ‌న గుర్తు చేశారు. సనాత‌న హిందూ ధ‌ర్మం కోసం ఈరోజు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను పీఠాధిప‌తులు, హిందూత్వ సంఘాలు ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భూమ‌న చెప్పుకొచ్చారు.  
Bhumana Karunakara Reddy
TTD
Tirumala
Andhra Pradesh

More Telugu News