రామ్ చ‌ర‌ణ్ మంచి మ‌న‌సు... గోల్డెన్ హార్ట్ అంటూ నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు... వీడియో వైర‌ల్‌!

  • చెర్రీ దంప‌తుల కార‌ణంగా ఓ మ‌హిళ‌కు అపోలో ఆసుప‌త్రిలో ఉచిత‌ చికిత్స
  • ఈ విష‌యాన్ని ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోలో వెల్ల‌డించిన మ‌హిళ‌ భ‌ర్త‌ 
  • ఆ వీడియో కాస్త బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌
  • రామ్ చ‌ర‌ణ్‌ది గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్‌బీకే అన్‌స్టాప‌బుల్ షోకు సంబంధించిన వీడియో అది. అందులో ఓ పెద్దాయ‌న త‌న భార్య‌కు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు ప్రాణం పోశార‌ని చెప్ప‌డం ఉంది. దాంతో చెర్రీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చ‌ర‌ణ్ మంచి మ‌న‌సు చాటుకున్నార‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. 

పెద్దాయ‌న మాట్లాడుతూ... "నా భార్య‌ ఏదేదో మాట్లాడేది. ఆ ప‌రిస్థితుల‌ను రామ్‌చ‌ర‌ణ్ తెలుసుకుని వెంట‌నే అంబులెన్స్ పంపించారు. అపోలో ఆసుప‌త్రికి తీసుకెళ్లాం. అక్క‌డికి వెళ్లి నా భార్య పేరు చెప్ప‌గానే మ‌మ్మ‌ల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. 17 రోజుల పాటు ఐసీయూలో ఉచితంగా చికిత్స అందించారు. రోజుకో స్పెష‌లిస్ట్ వ‌చ్చి చెక్ చేసేవారు. 

దాంతో ఆసుప‌త్రి బిల్ ఎంత అవుతుందోన‌ని కంగారు ప‌డుతూ ఉండేవాడిని... కానీ, చ‌ర‌ణ్, ఉపాస‌న దంప‌తులు ముందే చెప్పార‌ని, అంతా వాళ్లు చూసుకుంటార‌ని అక్క‌డి వారు చెప్పారు. రూపాయి తీసుకోకుండా నా భార్య‌కు ప్రాణం పోసి నాకు అప్ప‌గించారు" అని ఆ పెద్దాయ‌న బోరున ఏడ్చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అది చూసిన నెటిజ‌న్లు, మెగా అభిమానులు రామ్ చ‌ర‌ణ్‌ది గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  


More Telugu News