సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని పిలిచి... అత్యాచారం చేశాడు!
- హైదరాబాద్ కృష్ణానగర్ లో ఘటన
- మహిళపై అత్యాచారం చేసిన డైరెక్షన్ విభాగంలో పని చేస్తున్న వ్యక్తి
- జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
మూడు రోజుల క్రితం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ కృష్ణానగర్ లోని హెవెన్ హోటల్ కు ఆమెను పిలిచాడు. తొలిరోజు ఫొటో షూట్ చేశాడు. మరుసటి రోజు రావాలని చెప్పాడు. రెండో రోజు హోటల్ గదికి వెళ్లగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది, బీఎన్ఎస్ 64, 79, 115, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.