నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. వీడియో ఇదిగో!

   
ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. మరికాసేపట్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళి అర్పించనున్నారు. అలాగే, బసవతారకం ఆసుపత్రిలోనూ బాలకృష్ణ నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 


More Telugu News