Manchu Vishnu: ఆ కన్నప్పకు నా కన్నప్పకు తేడా ఉంది... ఇది నా వెర్షన్: మంచు విష్ణు

Manchu Vishnu says this is his version of Kannappa
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో కన్నప్ప చిత్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న మంచు విష్ణు ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. నేడు కన్నప్ప టీమ్ బెంగళూరులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. మంచు విష్ణు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, శరత్ కుమార్, ప్రభుదేవా ఈ మీడియా సమావేశానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, శరత్ అంకుల్, ప్రభు అన్న, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ వంటి దిగ్గజాలతో కలిసి వేదికను పంచుకోవడంతో తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఇక, గతంలో వచ్చిన కన్నప్ప చిత్రానికి, తమ కన్నప్ప చిత్రానికి తేడా ఉందని, ఇప్పుడు వస్తోందని తన వెర్షన్ అని మంచు విష్ణు స్పష్టం చేశారు.

"తెలుగులో 50 ఏళ్ల కిందట కృష్ణంరాజు హీరోగా భక్త కన్నప్ప చిత్రం వచ్చింది. ఇప్పుడు కన్నప్పను రీమేక్ చేస్తున్నాం. అయితే ఆనాటి కన్నప్ప, నేను తీస్తున్న కన్నప్ప సేమ్ స్టోరీ కాదు. కన్నప్ప కథను నా పంథాలో చెబుతున్నాను. ఇప్పటి తరానికి కన్నప్ప గురించి తెలియాల్సిన అవసరం ఉంది" అని మంచు విష్ణు వివరించారు.

మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి హేమాహేమీలు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Go Back to Shorts
Manchu Vishnu
Kannappa
Press Meet
Bengaluru

More Telugu News