పంచాయతీ కార్యదర్శులపై నల్గొండ కలెక్టర్ మానవత్వం!

  • అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు
  • ఇందులో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ కార్యదర్శులు
  • సస్పెండ్ చేయకుండా సర్వీస్ బ్రేక్‌తో విధుల్లోకి తీసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
పంచాయతీ కార్యదర్శులపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవత్వం చాటుకున్నారు. నల్గొండ జిల్లాలో దాదాపు 99 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరయ్యారు. ఇందులో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ కార్యదర్శులు ఉన్నారు.

ముందస్తు అనుమతులు లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరైతే అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉంటాయి. అయితే కలెక్టర్ ఇలా త్రిపాఠి మాత్రం మానవతా దృక్పథంతో వారిని సస్పెండ్ చేయకుండా సర్వీస్ బ్రేక్‌తో విధుల్లోకి తీసుకున్నారు.

Nalgonda District
Telangana
Congress

More Telugu News