విజ‌య‌వాడ దుర్గ‌గుడి వ‌ద్ద అధ్వాన ప‌రిస్థితులు... భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన మంత్రి లోకేశ్‌

  • ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌రిశుభ్ర‌త లోపించిందంటూ భ‌క్తుల పోస్టులు
  • తాగు నీరు కూడా లేద‌ని విమ‌ర్శ‌
  • నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియోలు 
  • మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌ని హామీ ఇచ్చిన మంత్రి
విజ‌య‌వాడ దుర్గ‌గుడి వ‌ద్ద అధ్వాన ప‌రిస్థితులు ఉన్నాయంటూ ప‌లువురు భ‌క్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌రిశుభ్ర‌త లోపించింద‌ని, తాగు నీరు కూడా లేద‌ని విమ‌ర్శించారు. అస‌లు ఈ ఆలయానికి ఈవో ఉన్నారా? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి చూడాల్సి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

దాంతో ఈ స‌మ‌స్య‌పై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు. మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 


More Telugu News