ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... 11 మంది నక్సల్స్ మృతి
- మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
- బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత
- నేటి ఉదయం 9 గంటల నుంచి ఎదురుకాల్పులు
బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.