Director Shankar: గేమ్ ఛేంజ‌ర్: ఆ విష‌యంలో నేను సంతృప్తిగా లేను.. డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు!

Director Shankar Interesting Comments on Game Changer Output
షార్ట్స్‌లో చూడండి
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్'. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సినిమా మిక్స్‌డ్ టాక్‌తో ప్ర‌స్తుతం థియేట‌ర్‌ల‌లో ర‌న్ అవుతుంది. అయితే, ఈ మూవీ ర‌న్‌టైంకి సంబంధించి ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇటీవ‌ల‌ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

శంక‌ర్‌ మాట్లాడుతూ.. "గేమ్ ఛేంజ‌ర్ అవుట్‌పుట్ విష‌యంలో నేను సంతృప్తిగా లేను. ముఖ్యంగా ర‌న్‌టైం విష‌యంలో. మొద‌ట‌గా నేను అనుకున్న దాని ప్ర‌కారం ఈ చిత్రం 5 గంట‌ల ర‌న్‌టైంతో ఉండాలి. కానీ సమయాభావం వల్ల కొన్ని అద్భుత‌మైన‌ సీన్స్ కూడా తొలిగించాల్సి వచ్చింది. దీంతో సినిమా అనుకున్నంత బాగా రాలేదు" అని శంకర్ అన్నారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్ప‌న్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించిన‌ ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 
Go Back to Shorts
Director Shankar
Game Changer
Ramcharan
Tollywood

More Telugu News