ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంలో ఊరట
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై ఉన్న చంద్రబాబు
- ఆ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం పిటిషన్
- వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్
వైసీపీ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తాజాగా బుధవారం విచారించింది. ఈ కేసులో చార్జిషీట్ కూడా దాఖలైన నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్ ను పరిశీలించలేమని పేర్కొంది.