జపాన్ లో భారీ భూకంపం
- నైరుతి జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం
- సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జీఎస్
- కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలు ఉపసంహరణ
కాసేపటి తర్వాత యూఎస్ జీఎస్ సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకున్నప్పటికీ... జేఎంఏ మాత్రం తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.. ఈ భూకంప కేంద్రం జపాన్ నైరుతి ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. క్యుషు ప్రాంతంలోని మియజాకి రాష్ట్రంలో రాత్రి 9.19 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది.