ఇస్రో స్పాడెక్స్ డాకింగ్ మిషన్లో కీలక ముందడుగు.. మూడు మీటర్ల దూరానికి ఉపగ్రహాలు!
- గత నెల 30న ఇస్రో స్పాడెక్స్ ప్రయోగం
- కొనసాగుతున్న డాకింగ్ ప్రక్రియ
- డాకింగ్ విజయవంతమైతే ఆ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్
- భారత భవిష్యత్తు ప్రయోగాలకు ఇది ఎంతో కీలకం
ఈ ప్రయోగం విజయవంతమైతే డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద ఉంది. చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడం, అంతరిక్షంలో భారత్ సొంత స్సేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలకు ఈ ప్రయోగం ఎంతో కీలకం. ప్రస్తుతం డాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.