రైతు భరోసాపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- జనవరి 26 నుంచి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలన్న సీఎం
- పథకాల అమలుపై గ్రామాలు, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించాలని సూచన
- 26 తర్వాత అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడి
సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకపోయినా సాగుకు అనుకూలమైన భూమికి మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సిందే అన్నారు. అనర్హులకు మాత్రం రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను, అనర్హులను గుర్తించాలన్నారు. స్థిరాస్తి భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను సేకరించాలన్నారు.