Meta: మెటా నిర్ణయంతో ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఇంతకీ ఏంటా నిర్ణయం?

Many users now searching how to delete Facebook And Instagram as Meta scraps fact checking
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ మెటా తాజా నిర్ణయం బూమ్ రాంగ్ లా మారింది. సోషల్ మీడియాలో పారదర్శకత ఉండాలనే స్ఫూర్తికి విరుద్ధంగా మారింది. దీంతో ఆ కంపెనీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లు తమ ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అదేసమయంలో తప్పుడు, నిరాధార వార్తలు కూడా వేగంగా జనంలోకి వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సామాజిక మాధ్యమాలు ‘ఫ్యాక్ట్ చెకింగ్’ ప్రమాణాలను పాటిస్తున్నాయి.

తమ యూజర్లు పెట్టే పోస్టులకు సంబంధించి క్రాస్ చెకింగ్ కు ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా ఏదేని పోస్టుపై మిగతా యూజర్లు సందేహం వ్యక్తం చేస్తే సాంకేతికత సాయంతో క్రాస్ చెకింగ్ చేసి నిజాలు వెల్లడించే అవకాశం కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో పారదర్శకతకు ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ సాయపడుతున్నాయి. అయితే, మెటా కంపెనీ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను వినియోగించకూడదని తాజాగా నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టా సహా పలు సామాజిక మాధ్యమాలలో పెట్టే పోస్టులకు ఫ్యాక్ట్ చెకింగ్ మెజర్స్ పాటించబోమని ప్రకటించింది.

ఈ నిర్ణయంపై సాంకేతిక నిపుణులతో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మెటా నిర్ణయాన్ని నిరసిస్తూ యూజర్లు తమ ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. ఆయా సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగుతున్నారు. టెక్ చర్చ్ కంపెనీ నివేదిక ప్రకారం.. గూగుల్ లో చాలామంది యూజర్లు ఫేస్ బుక్ నుంచి శాశ్వతంగా వైదొలగడం ఎలా, ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయం ఏంటి.. అని వెతుకుతున్నారని సమాచారం. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ పెరిగిందని, దీనికి మెటా నిర్ణయమే కారణమని టెక్ చర్చ్ కంపెనీ వెల్లడించింది.
Go Back to Shorts
Meta
Facebook
Instagram
Fact Check
Social Media

More Telugu News