ఆసీస్ టూర్ నుంచి తిరిగొచ్చిన నితీశ్ రెడ్డికి విశాఖ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
- ఆస్ట్రేలియా టూర్లో అంచనాలకు మించి రాణించిన నితీశ్ కుమార్
- సెంచరీ సహా 289 పరుగులు చేసిన ఆంధ్రా యువకిశోరం
- బౌలింగ్ లోనూ 5 వికెట్లు తీసిన వైనం
ఇక, ఆసీస్ టూర్ నుంచి తిరిగొచ్చిన నితీశ్ కు సొంతగడ్డ విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో నితీశ్ కుమార్ పై అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్రత్యేక వాహనంలో ఎక్కిన ఈ డాషింగ్ ఆల్ రౌండర్ ఊరేగింపుగా తన నివాసానికి చేరుకున్నాడు. ఓపెన్ టాప్ జీప్ లో ముందు సీట్లో నితీశ్ కూర్చోగా, వెనుక ఆయన తండ్రి ముత్యాలరెడ్డి ఉన్నారు. నితీశ్ నివాసం గాజువాకలో ఉంది. ఎయిర్ పోర్టు నుంచి గాజువాక వరకు అభిమానులు తీన్ మార్ వాయిద్యాల నడుమ నితీశ్ ను ఊరేగింపుగా తీసుకెళ్లారు.