తిరుపతి విషాదం వేళ వైరల్ గా మారిన గరికపాటి పాత వీడియో
- అదే రోజు, అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలంటే ప్రమాదాలు జరుగుతాయన్న గరికపాటి
- ఫలానా ముహూర్తంలో తప్పకుండా భగవంతుడి దర్శనం చేసుకోవాలనేంలేదని వ్యాఖ్య
- శరీరాన్ని మించిన క్షేత్రంలేదు.. మనస్సును మించిన తీర్థంలేదన్న గరికపాటి
ముక్కోటి ఏకాదశికి ఆలయాలకు పోటెత్తడం సరికాదని, ఆ మరుసటి రోజు లేదా రెండు మూడు రోజులు ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం లేదని గరికపాటి చెప్పారు. ఆలస్యంగా వచ్చావని దేవుడు ఏమీ శపించడని అన్నారు. మనస్సు నిండా మట్టి నింపుకుని ఆ రోజే చూడాలి, ఏదేమైనా వెళ్లాలని అనుకోవడం పిచ్చితనమని అన్నారు. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తిథులు ఇవేవీ ముఖ్యం కావని చెప్పుకొచ్చారు. ‘శరీరాన్ని మించిన క్షేత్రం, మనస్సును మించిన తీర్థం లేవు.. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్య తీర్థం’ అని గరికపాటి పేర్కొన్నారు.