'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ
- అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతి నిరాకరణ
- విడుదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి
- టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
సినిమా విడుదల రోజున ఉదయం 4 గంటల నుంచి ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా టిక్కెట్ ధరల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజున సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 వరకు ఐదు షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.