సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెంకన్నను దర్శించుకున్న జపాన్ దేశస్తులు... వీడియో ఇదిగో
- తిరుమలో సందడి చేసిన జపాన్ టూరిస్టులు
- హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా వస్త్రధారణ
- జపాన్ దేశస్తులను ఆసక్తిగా తిలకించిన ఇతర భక్తులు
తాజాగా, కొందరు జపాన్ దేశస్తులు తిరుమలలో సందడి చేశారు. భారత సంప్రదాయాలను ప్రతిబించేలా దుస్తులు ధరించిన ఆ జపనీయులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. జపాన్ వాళ్లు చీరలు, పంచె కట్టులో రావడంతో ఇతర భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. జపాన్ భక్త బృందంలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.