హెచ్ఎంపీవీ వైరస్ అంటూ భయం కలిగించే ప్రచారం చేయద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
- హ్యూమన్ మెటానియో వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి దామోదర
- ప్రజలను భయపెట్టేలా ప్రచారం చేస్తే చర్యలుంటాయన్న మంత్రి
- 2001లోనే హెచ్ఎంపీవీ గుర్తించారన్న దామోదర
ఈ క్రమంలో దీనిపై మంత్రి రాజనరసింహ స్పందించారు. ప్రజలు ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్‌ను గుర్తించారని చెప్పారు. శ్వాస వ్యవస్థపై ఈ వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. విదేశాల్లో హెచ్ఎంపీవీ కేసుల నమోదు, పరిస్థితులను పరిశీలిస్తున్నామని మంత్రి రాజనరసింహ తెలిపారు.