హెచ్ఎంపీవీ కేసులు... అధికారులకు ఢిల్లీ మంత్రి కీలక ఆదేశాలు
- వైరస్ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు
- కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీ ఆరోగ్య శాఖకు ఆదేశం
- వైరస్ విషయంలో ఆదేశాలు, సూచనల కోసం ఫోన్లో సంప్రదించవచ్చునని సూచన
ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరపాలన్నారు.
ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించి ఎలాంటి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు కావాలన్నా తనను వెంటనే ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజు మూడు ఆసుపత్రులను తనిఖీ చేసి సంబంధిత నివేదికలను తనకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.