గ్రూప్-1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి
- ఏడాది కాలంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
- దేశంలోనే ఇదొక రికార్డు అని స్పష్టీకరణ
గత 14 ఏళ్లలో గ్రూప్-1 నియామకాలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఒకేసారి 563 గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తాము గ్రూప్-1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. మార్చి 31 లోపు గ్రూప్-1 నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక, తెలంగాణ క్యాడర్ అధికారులు కేంద్రంలో ఉన్నా... రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.