Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలిసారి రష్యన్ చాపర్‌ను పడగొట్టిన ఉక్రెయిన్ నేవల్ డ్రోన్

Ukraine Drone Destroys Russian Chopper For First Time
Advertisement
  • క్షిపణి ఢీకొట్టిన వెంటనే భయభ్రాంతులకు గురైన రష్యన్ చాపర్ పైలట్
  • హెలికాప్టర్ కూలిపోతున్న విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా తెలిపిన పైలట్
  • పైలట్ రేడియో ఇంటర్‌సెప్ట్‌ను సంపాదించి షేర్ చేసిన ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్
  • హెలికాప్టర్‌పై డ్రోన్ దాడి వీడియో విడుదల
Advertisement
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ నేవల్ డ్రోన్ నిన్న తొలిసారి ఎయిర్ టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించింది. రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాప్టర్‌ను కూల్చివేసింది. దాడికి గురైన రష్యా హెలికాప్టర్ పైలట్ ఆ విషయాన్ని రేడియో కమ్యూనికేషన్‌లో మాట్లాడుతూ.. హెలికాప్టర్ దాడికి గురైందని, అది కిందికి జారిపోతోందని చెబుతున్న ఆడియోను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంపాదించి విడుదల చేసింది.

ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. నిన్న మగురా వీ5 నేవల్ డ్రోన్లను ఉపయోగించి నల్ల సముద్రంపై రష్యన్ హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ కూల్చేసింది. మరో హెలికాప్టర్ట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దాడికి గురైన హెలికాప్టర్ నల్ల సముద్రంలో కూలిపోతున్న వీడియోను షేర్ చేసింది. 

ఆ వీడియో థెర్మల్ ఇమేజ్‌‌లో ఎగురుతున్న హెలికాప్టర్ తెల్లగా కనిపిస్తుండగా ఆకాశం చీకటిగా ఉంది. అస్పష్టంగా ఉన్న వీడియోలో క్షిపణి దాడులు కనిపిస్తున్నాయి. దాడికి గురైన హెలికాప్టర్ నల్ల సముద్రంలో కూలిపోవడానికి ముందు కిందికి జారిపోవడం కనిపించింది. హెలికాప్టర్‌పై దాడి తర్వాత పైలట్ భయభ్రాంతులకు గురయ్యాడు. రేడియో కమ్యూనికేషన్‌లో మాట్లాడుతూ ‘‘482, హెలికాప్టర్‌పై దాడి జరిగింది.. చాపర్ కిందికి జారిపోతోంది’’ అని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత ‘‘అక్కడ పేలుడు సంభవించింది. హెలికాప్టర్ దాడికి గురైంది. కిందనున్న నీటి నుంచి లాంచ్ వచ్చింది. ఆ తర్వాత మరో ఫ్లాష్ వచ్చింది. అది ఎక్కడికి వెళ్లిందో నేను చూడలేదు. కానీ, మొదటిది నన్ను నేరుగా ఢీకొట్టి సమీపంలోనే పేలిపోయింది. హెలికాప్టర్‌లో కొన్ని వ్యవస్థలు విఫలమయ్యాయి’’ అని పైలట్ పేర్కొన్నాడు. 

క్రిమియా పశ్చిమ తీరంలోని కేప్ టర్ఖాన్‌కుట్ సమీపంలో ఇది జరిగింది. క్షిపణులు అమర్చిన మగురా వీ5 సముద్ర డ్రోన్ రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఈ విషయాన్ని జీయూఆర్ స్పై ఏజెన్సీ తన టెలిగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. ఉక్రెయిన్ నేవల్ డ్రోన్ ఎయిర్ టార్గెట్‌ను ఛేదించడం ఇదే తొలిసారని తెలిపింది. 
Advertisement
Advertisement
Russia-Ukraine War
Ukraine Naval Drone
Russian Mi-8 Helicopter

More Telugu News