Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన మహిళా పోలీసుపై వేటు

Govt suspends a woman police in YSR district
Advertisement
  • ఏపీలో నేడు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
  • వైఎస్సార్ జిల్లాలో ఓ మహిళా పోలీసు వసూళ్ల దందా
  • కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్
Advertisement
ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతస్థాయిలో జరుగుతోంది. కాగా, వైఎస్సార్ జిల్లాలో పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన ఓ మహిళా పోలీసుపై సస్పెన్షన్ వేటు పడింది. 

జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ సందర్భంగా మహిళా పోలీసు భారతి వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడైంది. భారతి జమ్మలమడుగులో వార్డు సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఈ ఉదయం పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆమె పలువురి నుంచి డబ్బులు తీసుకోవడం అధికారుల దృష్టికి వెళ్లింది. వసూళ్ల నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు.
Advertisement
Advertisement
Woman Police
Suspension
Pensions
YSR District

More Telugu News