Nitish Kumar Reddy: బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ రెడ్డి అరుదైన ఘ‌న‌త‌.. తొలి భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు!

Nitish Reddy Shatters Historic Record With Australia Thrashing Becomes 1st Ever Indian
షార్ట్స్‌లో చూడండి
మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భార‌త యువ ఆట‌గాడు నితీశ్ కుమార్ రెడ్డి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు బీజీటీ సిరీస్‌లో ఈ యంగ్ ప్లేయ‌ర్ మొత్తం 8 సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఆస్ట్రేలియాలో సింగిల్ సిరీస్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన తొలి భార‌తీయ ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. 

అలాగే ఇంగ్లండ్ ప్లేయ‌ర్ మైఖేల్ వాన్, క‌రేబియ‌న్ ఆట‌గాడు క్రిస్ గేల్ స‌ర‌స‌న నితీశ్ రెడ్డి చేరాడు. ఆస్ట్రేలియాలో 2002-03 యాషెస్ సిరీస్ లో వాన్ 8 సిక్సులు కొట్ట‌గా, 2009-10 ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో గేల్ కూడా 8 సిక్సులే న‌మోదు చేశాడు. 

ఇక నాలుగో టెస్టులో అద్భుత‌మైన అర్ధ శ‌త‌కంతో టీమిండియాను ఫాలో-ఆన్ గండం నుంచి ఈ తెలుగు ఆట‌గాడు గ‌ట్టేక్కించిన విష‌యం తెలిసిందే. బ‌డా బ్యాట‌ర్లు ఫెయిల్ అయిన పిచ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తొలి టెస్టు సెంచ‌రీ దిశ‌గా దూసుకెళ్తున్నాడు. ఇప్ప‌టికే వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి శ‌త‌క భాగ‌స్వామ్యం అందించాడు. 

మూడోరోజు ఆట‌లో ఈ ఇద్ద‌రు అర్ధ శ‌త‌కాలు న‌మోదు చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం భార‌త్ స్కోరు 346/7 (110 ఓవ‌ర్లు) ఉండ‌గా.. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (95), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) ఉన్నారు. 
Go Back to Shorts
Nitish Kumar Reddy
Australia
Team India
Cricket
Sports News

More Telugu News