అజర్ బైజాన్ విమాన ప్రమాదానికి ఉక్రెయిన్ కారణం అంటున్న రష్యా

Russia alleges Ukraine caused to Azerbaijan plane crash
  • పశ్చిమ కజకిస్థాన్ లో కూలిపోయిన విమానం
  • 38 మంది ప్రయాణికులు దుర్మరణం
  • గ్రోజ్నీ నగరంలో దిగేందుకు విఫలయత్నం చేసిన పైలెట్
  • అక్తావు ఎయిర్ పోర్టులో దిగే ప్రయత్నంలో ప్రమాదం
అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం పశ్చిమ కజకిస్థాన్ లో కూలిపోవడం తెలిసిందే. బాకు నుంచి గ్రోజ్నీ వెళుతున్న ఆ విమానంలో మొత్తం 67 మంది ఉండగా, 38 మంది దుర్మరణం పాలయ్యారు. 29 మంది గాయాలతో బయటపడ్డారు. 

కాగా, ఈ విమాన ప్రమాదానికి ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపించింది. గ్రోజ్నీ నగరంలో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండయ్యే సమయంలో, నగరంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి పాల్పడ్డాయని వెల్లడించింది. దాంతో ఆ విమానం గ్రోజ్నీలో ల్యాండ్ కాలేకపోయిందని, ఆ తర్వాత కాసేపటికే కజకిస్థాన్ లో కుప్పకూలిపోయిందని రష్యా పౌర విమానయాన శాఖ చీఫ్ దిమిత్రీ యద్రోవ్ వివరించారు.  ఉక్రెయిన్ సైనిక డ్రోన్లు పౌర వ్యవస్థలపైనా ఉగ్రదాడులు చేపడుతున్నాయని యద్రోవ్ పేర్కొన్నారు. 

ఆ విమానం రాకకు ముందు గ్రోజ్నీ నగరంలో దట్టమైన పొగ అలముకుని ఉందని, ఆ సమయంలో విమానాశ్రయం వద్ద పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు.

కూలిపోకముందు అజర్ బైజాన్ విమానం రెండు సార్లు ల్యాండింగ్ కు విఫలయత్నాలు చేసిందని తెలిపారు. దాంతో, రెండు ప్రత్యామ్నాయ ఎయిర్ పోర్టులను అధికారులు సూచించినప్పటికీ ఆ పైలెట్  అక్తావు ఎయిర్ పోర్టులోనే విమానాన్ని దించేందుకు ప్రయత్నించాడని వివరించారు. 

మరోవైపు, అజర్ బైజాన్ విమానం కూలిపోయిన ఘటనకు రష్యానే బాధ్యత వహించాలని ఉక్రెయిన్ అంటోంది.
Go Back to Shorts
Azerbaijan Plane Crash
Russia
Ukraine

More Telugu News