తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్లు
- మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టులో పిటిషన్
- కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసిన కోర్టు
- ఈ నోటీసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జులై 10న కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని వారు తాజాగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.