రేవతి కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల ఆర్థిక సాయం
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి
- బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కు అందించిన నిర్మాత నవీన్
- కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
పుష్ప-2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. ఈ నెల 4న సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలను అందించింది.