ఎక్కువ వ్యూస్ కోసం తప్పుడు థంబ్ నెయిల్స్... చర్యలకు సిద్ధమైన యూట్యూబ్
- యూట్యూబ్ లో పెడ ధోరణులు
- వ్యూస్ కోసం పాకులాడుతూ యూజర్లను తప్పుదారి పట్టించే థంబ్ నెయిల్స్
- రాంగ్ టైటిల్స్ తో యూజర్లను విసుగెత్తిస్తున్న యూట్యూబ్ చానళ్లు
- కొత్త నిబంధనలు తీసుకువస్తున్న యూట్యూబ్
ఈ నేపథ్యంలో, యూట్యూబ్ కఠిన చర్యలకు సిద్ధమైంది. తప్పుడు థంబ్ నెయిల్స్, రాంగ్ హెడ్డింగ్ లతో యూజర్ల సమయాన్ని వృథా చేసే యూట్యూబ్ చానళ్లను కట్టడి చేయాలని నిర్ణయించింది. అందుకోసం త్వరలోనే నూతన నిబంధనలు తీసుకురానున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది.
ఈ కొత్త నిబంధనల అమలు కోసం యూట్యూబ్ చానళ్ల నిర్వాహలకు తగిన సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత కూడా తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియోలు అప్ లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. మొదటి హెచ్చరికగా అలాంటి వీడియోలను డిలీట్ చేస్తారు. మరోసారి తప్పిదానికి పాల్పడితే చానల్ పై ఆంక్షలు విధిస్తారు. ఇందులో జరిమానాలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.