వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లు
- వైసీపీని వరుసగా వీడుతున్న నేతలు
- విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ రాజీనామా
- వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నాన్న ఆనంద్ కుమార్
ఆనంద్ తో పాటు 12 మంది డెయిరీ డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో వరాహ వెంకట శంకర్రావు, పిల్లా రమా కుమారి, కోళ్ల కాటమయ్య, శీరంరెడ్డి సూర్యనారాయణ, ఆరంగి రమణబాబు, రెడ్డి రామకృష్ణ, దాడి పవన్ కుమార్, పరదేశి గంగాధర్, సుందరపు ఈశ్వర్, చిటికెల రాజకుమారి తదితరులు ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.