అల్కాపురిలో అక్రమ షట్టర్లపై పంజా విసిరిన హైడ్రా
- మార్నింగ్ రాగా అపార్ట్ మెంట్ లో అక్రమ షట్టర్ల నిర్మాణం
- గత నెలలోనే నోటీసులు ఇచ్చిన మణికొండ మున్సిపాలిటీ
- స్పందించిన షట్టర్ల సొంతదారులు
- హైడ్రాకు నివేదించిన మున్సిపల్ అధికారులు
ఈ షట్టర్లకు సంబంధించి మణికొండ మున్సిపాలిటీ అధికారులు నవంబరు 27నే నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో షట్టర్లను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ, ఆ షట్టర్ల సొంతదారుల నుంచి స్పందన లేదు. దాంతో, మున్సిపల్ అధికారులు ఈ విషయాన్ని హైడ్రాకు నివేదించగా, హైడ్రా రంగంలోకి దిగి ఆ షట్టర్లను కూల్చివేసింది.
ఈ సందర్భంగా, అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హైడ్రా సిబ్బందిని, పోలీసులను అడ్డుకునేందుకు అపార్ట్ మెంట్ వాసులు ప్రయత్నించారు. అయితే, ఆ షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే తొలగిస్తున్నామని హైడ్రా సిబ్బంది స్పష్టం చేశారు.