ఏ హోదాతో హరీశ్ రావు మాట్లాడుతున్నారు?: కోమటిరెడ్డి
- వాడీవేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- హరీశ్ రావు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? అని ప్రశ్నించిన కోమటిరెడ్డి
- కేసీఆర్ ఎక్కడున్నారని కోమటిరెడ్డి ప్రశ్న
ఆరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... అసలు హరీశ్ రావు ఎవరని ప్రశ్నించారు. డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? ఏ హోదాతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారని అడిగారు. నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు హరీశ్ కు లేదని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని పట్టించుకోలేదని విమర్శించారు. నిన్న కూడా కోమటిరెడ్డి, హరీశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే.