’నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా‘ అంటూ ప్యాసింజర్ కు ఉబెర్ డ్రైవర్ మెసేజ్
- భయంతో వణికిపోయిన ప్యాసింజర్.. గురుగ్రామ్ లో ఘటన
- రైడ్ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోకి పరుగు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
‘ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నా. మరో గంటలో రైలు బయలుదేరుతుంది. త్వరగా రమ్మంటూ డ్రైవర్ కు మెసేజ్ చేశా. ఆ తర్వాత ఫోన్ ను జేబులో పెట్టుకుని లగేజీతో రోడ్డుపైకి వచ్చా. కాసేపటి తర్వాత ఓటీపీ చూద్దామని ఫోన్ బయటకు తీశా. ఉబెర్ యాప్ లో డ్రైవర్ చేసిన మెసేజ్ నన్ను భయాందోళనలకు గురిచేసింది. త్వరగా రమ్మని నేను పెట్టిన మెసేజ్ కు ఆ డ్రైవర్ నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నా అంటూ జవాబిచ్చాడు. అది చూసి నాకు వెన్నులో వణుకుపుట్టింది. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకున్నా. రైడ్ క్యాన్సిల్ చేద్దామని ప్రయత్నించేలోగా ఆ డ్రైవరే క్యాన్సిల్ చేశాడు. భయంతో నేను లగేజీ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయా. ప్రయాణం రద్దు చేసుకున్నా. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా? లేక ఉబెర్ కంపెనీకి కంప్లైంట్ చేయాలా?’ అంటూ రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్ట్ పై ఉబెర్ ఇంకా స్పందించలేదు.