మా నాన్న పోలీసే.. నన్ను కాపాడతాడంటూ కారు బానెట్‌పై ప్రయాణించిన యువకుడు.. వీడియో ఇదిగో!

Haryana Boy Car Roof Ride Video Viral Proudly Claiming His Father is Policeman
  • నెల రోజుల క్రితం హర్యానాలో ఘటన
  • 3.5 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న వీడియో
  • తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు
  • ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలంటూ డిమాండ్లు
సోషల్ మీడియా పైత్యం తలకెక్కిన యువత వెర్రితలలు వేస్తోంది. ఇందుకు బోల్డన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి రిస్కీ వీడియోలు చేస్తూ లైకులు, కామెంట్ల కోసం వెర్రిత్తిపోతున్నారు. తాజాగా, హర్యానాలో ఓ యువకుడు మహీంద్రా థార్ వాహనం బానెట్‌ పైన కూర్చుని ప్రయాణించాడు. స్నేహితులు అతడిని మరికొన్ని కార్లతో అనుసరించారు. నెల రోజుల క్రితం నాటిదిగా చెబుతున్న ఈ వీడియో సోషల్ మీడియాకెక్కి ఏకంగా 3.5 కోట్ల వ్యూస్ సాధించింది. 

ఆ వీడియోలో యువకుడు మాట్లాడుతూ.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినా పర్లేదని, పోలీస్ అయిన తండ్రి తనను రక్షిస్తాడని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. హర్యానాలో ఏం జరుగుతోందని, కుమారుడు ఇలాంటి ప్రమాదకర, పిచ్చి పనులు చేస్తుంటే తండ్రి అతడిని రక్షిస్తాడా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు అతడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించాలని మరో యూజర్ డిమాండ్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమని, ఓ కుర్రాడు ఇలానే కూర్చుని ప్రయాణిస్తూ స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి తలపగిలి అక్కడికక్కడే మరణించాడని ఇంకో యూజర్ పేర్కొన్నాడు. యువకుడిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Viral Video
Haryana
Car Roof Ride

More Telugu News