కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా... వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా
- ఆరుగురితో సిట్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం
- 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
బియ్యం అక్రమ రవాణాపై 13 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో సిట్ కు ప్రభుత్వం పలు అధికారాలను కల్పించింది. తనిఖీలు, జప్తులు, అరెస్ట్ చేసేందుకు అధికారాలు కల్పించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.