Allu Arjun: తొక్కిసలాటలో మహిళ మృతి.. అల్లు అర్జున్ పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదయిందంటే!

Police case on Allu Arjun in Chikkadapalli PS
షార్ట్స్‌లో చూడండి
'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంథ్య థియేటర్ లో తొక్కిసలాట చోసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. 

బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 105 (హత్య లేదా ప్రాణ నష్టం కేసు), 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బన్నీపై కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెపుతున్నారు. 

బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది. పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు, హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారాన్ని తమకు ఎవరూ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Allu Arjun
Pushpa 2
Tollywood
Police Case

More Telugu News