Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే ఆవుకు అంతటి ప్రాధాన్యత!

మన భారతదేశంలో ఆవుకు పురాతన కాలంనుండి ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమాతగా పూజిస్తాం. ఇప్పుడు తాజాగా చేసిన పరిశోధనల వల్ల ఈ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఆవులో మరే ఇతర జంతువుల్లోనూ లేని అత్యద్భుతమైన యాంటీబాడీస్‌ ఎన్నో రకాలైన జబ్బులకు దివ్యౌషధాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజంగా ఆవులు కొన్ని రకాలైన జబ్బులను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. ఈ విషయం గురించి గోవుల్లోని ప్రతిరక్షక పదార్ధాల నిర్మాణ క్రమం గురించి, వాటి పనితీరు గురించి నిశితంగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు వాటిలోని యాంటీబాడీస్‌ మరే ఇతర జంతువుల్లోనూ కనిపించవని తేల్చారు.

స్క్రిప్స్‌ పరిశోధనా సంస్థకు చెందిన సెల్‌ మోలిక్యులర్‌ బయాలజీ విభాగానికి చెందిన నిపుణులు వాన్‌.వి.స్మయిడర్‌ నేతృత్వంలో కొందరు శాస్త్రవేత్తలతో కూడిన అధ్యయన బృందం ఆవులోని యాంటీబాడీస్‌పై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనల్లో ఆవుల్లోని యాంటీబాడీస్‌ నిర్మాణ క్రమం, వాటి పనితీరు మరే ఇతర జంతువుల్లోనూ కనిపించదని, వాటిలోని యాంటీబాడీస్‌ వ్యవస్థ నిర్మాణ క్రమంలోని వైవిధ్యమే ఈ ప్రత్యేకతకు కారణమని తేలింది. ఈ యాంటీబాడీస్‌ ఎన్నో రకాలైన జబ్బులకు దివ్యౌషధాలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News