Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది: మంత్రి మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ లేఖ

TDP MLC letter to Nadendla Manohar
Advertisement
  • మనోహర్ కు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ
  • వేంపల్లి, ముదిగుబ్బ వైసీపీ నేతలు బియ్యం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్నారన్న ఎమ్మెల్సీ
  • మిత్రమనాయుడు అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణ
Advertisement
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. 

పులివెందుల... అనంతపురం జిల్లా సరిహద్దులలో ఉండడంతో అక్రమ రవాణాకు, బియ్యం నిల్వలకు వీలుగా ఉంటుందన్న కారణంతో స్మగ్లర్లు దీన్ని తమ స్థావరంగా మార్చుకున్నారని వివరించారు. 2019 నుంచి గత ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ కు పాల్పడినవారే, ఇప్పుడు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని రాంగోపాల్ రెడ్డి వివరించారు. 

వేంపల్లి, ముదిగుబ్బ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు ఈ అక్రమ రవాణాలో కీలకంగా ఉన్నారని చెప్పారు. ముదిగుబ్బకు చెందిన వైసీపీ నేత మిత్రమనాయుడు గత ఐదేళ్లుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు.

ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే ఈ స్మగ్లర్ల ఆదాయం నెలకు రూ.1 కోటి వరకు ఉందని తెలిపారు. అధికార యంత్రాంగం ఈ తంతును చూసీచూడనట్టు వదిలేస్తోందని, చిన్న చిన్న కేసులతో సరిపెడుతున్నారని వివరించారు. బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్లను కోరారు. 

పులివెందుల నుంచి అనంతపురం జిల్లాకు ఉన్న సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల ప్రాంతంలోని రైస్ మిల్లులు, బియ్యం గోడౌన్లపై నిత్యం నిఘా ఉంచాలని, అక్రమ రవాణా గురించి తెలిసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Nadendla Manohar
Janasena

More Telugu News