Harish Rao: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుగా ఉంది: హరీశ్ రావు

Harish Rao challenges Revanth Reddy over kcr farm house

  • కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించారని విమర్శ
  • కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫాం హౌస్ ఉందని నిరూపించగలవా? అని నిలదీత
  • అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ముందా? అని ప్రశ్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుగా ఉందని, అందుకే మళ్లీ తనకు అవకాశం వస్తుందా? అనే ఆందోళన ఆయనలో కనిపిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌస్ ఉన్నట్లు నిరూపించగలవా? అని ప్రశ్నించారు. నిరూపించలేని పక్షంలో సీఎం పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అబద్ధాలు చెబుతూ ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. ఈ అబద్ధాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవన్నారు.

అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి తమను తెగ పిలుస్తున్నాడని... ఆ సమయం కోసమే తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News