Gautam Adani: ఇలాంటి కేసులు ఎన్నో చూశాం: గౌతమ్ అదానీ
- అమెరికాలో అదానీ గ్రూప్ సంస్థలపై కేసులు నమోదు
- ఇటువంటి కేసులు ఎదుర్కోవడం కొత్త కాదన్న గౌతమ్ అదానీ
- సమస్యలు, దాడులు తమను మరింత దృఢంగా మార్చుతాయని వెల్లడి
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన జెమ్ అండ్ జ్యుయెలరీ అవార్డుల ప్రదానోత్సవంలో అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమపై అమెరికాలో కేసులు నమోదు కావడం పట్ల ఆయన స్పందించారు. ఇలాంటి కేసులు ఎన్నో చూశామని అన్నారు. అదానీ గ్రూప్ కు ఇలాంటి కేసులను ఎదుర్కోవడం కొత్త కాదని స్పష్టం చేశారు.
ఇలాంటి సమస్యలు, దాడులు తమను మరింత దృఢంగా మార్చుతాయని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. మా సంస్థకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి ఒక విజయసోపానంగా మారుతుంది అని వ్యాఖ్యానించారు.
భారత్ లో సోలార్ ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లంచాలు ఇచ్చినట్టు అదానీ గ్రూప్ సంస్థలపై ఇటీవల ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఆరోపణలతో అమెరికాలో కేసులు నమోదు కాగా, భారత్ లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది.